Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సానియా మీర్జా అమ్మాయి పేరు మిరిల్లా!

టెన్నిస్ మహిళల వరల్డ్ డబుల్స్ నెంబర్ వన్ క్రీడాకారిణి సానియా మీర్జాకు కుమార్తె పుడితే ఆమెకు మిరిల్లా లేదా రీమ్ అని పేరు పెడతామని ఆమె భర్త షోయబ్ మాలిక్ చెప్పాడు. సానియా నెంబర్ వన్ ర్యాంకు సందర్భంగా సామాజిక మాధ్యమం ద్వారా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు మాలిక్ ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు రిమోట్ సానియా చేతిలోనే ఉంటుందని, ఆమెకు నచ్చిన ఛానెలే చూడాలని షోయబ్ చెప్పాడు. క్రికెటర్ కాకుంటే సానియాకు మేనేజర్ ని అయ్యుండేవాడినని చమత్కరించాడు. క్రికెట్ తరువాత తన తల్లి అంటే తనకు ఇష్టమని షోయబ్ నిజాయతీగా ఒప్పుకున్నాడు. భార్యాభర్తలన్నాక గొడవలు సర్వసాధారణమని, అయితే కీచులాటను సానియా ఆరంభిస్తే, ముగింపు తానిస్తానని షోయబ్ చెప్పాడు. త్వరలోనే బుల్లి మాలిక్ ను ప్రపంచానికి పరిచయం చేస్తామని అభిమానులకు మాటిచ్చాడు. వివాహం తరువాత సానియా మంచి ఫామ్ లో ఉండగా, తన కెరీర్ పతనం కాలేదని అభిప్రాయపడ్డాడు. టీనేజ్ లో ఉండగా ప్రేమలో పడ్డానని షోయబ్ అంగీకరించాడు.

More Telugu News